సాలూరు పట్టణంలో ఆర్టీసీడిపో ఆవరణలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదివారం సాలూరు-విశాఖ బస్సును ప్రారంభించారు. డ్రైవర్ సీట్లో కూర్చొని బస్సును నడిపారు. బసుఎక్కి మొదటి టిక్కెట్‌ను కొనుగోలుచేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ గత ప్రభుత్వంలో బస్సెక్కడంతో ఏ అధికారులు తనపై కేసుపెట్టారో ఆ అధికారులే తనతో బస్సును ప్రారంభించారని తెలిపారు. అనంతరం డిపో ఆవరణ లోమొక్కలునాటారు.కాగా పట్టణంలో వడ్డివీధిలో నిర్మించిన సీతాసమేత రామమంది రాన్ని సంధ్యారాణి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం భాస్కరరెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, కౌన్సిలర్లు వాడాడ శోభారాణి, అప్పయ్య మ్మ, మజ్జి శైలజ, మజ్జి చిరంజీవులు, వైదేహి టీడీపీ నాయకులు పాల్గొన్నారు.