కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ రాజమహేంద్రవరం, కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రంలో బయో పోర్టిఫైడ్, వాతావరణ అనుకూల పంటల రకాలపై రైతులకు, వ్యవసాయ విద్యార్థులకు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేవీకే హెడ్ వీఎస్‌జీఆర్ నాయుడు మాట్లాడుతూ భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్)విడుదల చేసిన రకాల్లో 69 క్షేత్ర పంటలు, 40 ఉద్యాన పంటల రకాలు ఉన్నాయన్నారు. బయోపోర్టిఫికేషన్ అనేది జన్యుమార్పు ద్వారా అవసరమైన పోషకాలను అధికస్థాయిలో కలిగి ఉండేలా ప్రధా నమైన పంటలను ఉత్పత్తి చేసే ప్రక్రియ సాధారణ ఫోర్టిఫికే న్‌లో ఆహార పదార్థాలకు ఫుడ్ ప్రోసెసింగ్ విధానంలో విలువ జోడింపు ద్వారా పోషకాలను పెంచుతారన్నారు. బయోపోర్టిఫికేషన్ అనేది మొక్కలు పెరుగుతున్నప్పుడు మొక్క ఆహారాన్ని మరింత పోషక మైనదిగా చేయడంపై దృష్టి పెడుతుందన్నారు. బయోఫోర్టిఫైడ్, వాతావరణ అనుకూల పంట రకాలను త్వరితగతిన అందుబాటు లోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవీకే వివిధ విభాగాల సాంకేతిక అధికారులు సత్యవాణి బి.నాగేశ్వ రరెడ్డి, రవీంద్ర, రఘునందన్, సంజయ్‌లతో రాజానగరం, కోరుకొండ మండలాలకు చెందిన రైతులు, రైతు మహిళలు తదితరులు పాల్గొన్నారు.