సెప్టెంబరు 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరుగనున్న ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాజమహేంద్రవరం జిల్లా కన్వీనర్ కూండ్రపు రాంబాబు, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపాక మధు అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని కార్యాలయంలో ఈ మేరకు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకే దేశ సంపదను దోచిపెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వరంగంలోని రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, బొగ్గు గనులను అప్పగిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు విశాఖపట్నంలో జరిగే జాతీయ సమితి సమ్మేళనంలో దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్ప రమణ, అల్యూమినియం వర్కర్స్ యూనియన్ నాయకుడు కొండలరావు, సుబ్బారావు, పేపర్‌మిల్లు వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.