కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. CGF కింద 160 ఆలయాలు పున: నిర్మిస్తామని ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు.