వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వైద్యారోగ్య శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నాను. వైద్యారోగ్య శాఖ పనితీరుపై సీఎం గారు ఆరా తీశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అనారోగ్య శాఖ మారిన ఆరోగ్య శాఖను తిరిగి గాడిన పెట్టే బృహత్తర బాధ్యత మనందరిపై ఉందని గుర్తుచేశారు.ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలు.. అమలు చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్యసేవ అమలులో లోపాలు ఉండొద్దని, ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. వైద్యం విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, వైద్య సేవలను సక్రమంగా అందించాలని, మందులను అన్ని వేళలా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.