టెక్కలి నియోజకవర్గంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉమ్మడి పార్టీల కార్యకర్తలు గ్రామాల అభి వృద్ధే ప్రాతిపదికగా పనిచేయాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం నిమ్మాడలోని తన క్యాం పు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సహాయ సహకారాలందిస్తానన్నారు. ఐదేళ్ల కిందట పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకొనేలా చర్యలు చేపడతామన్నారు. గ్రామాల్లోని సమస్యలను తెలిపేందుకు కార్యకర్తలు గుంపులుగా వచ్చి సమయం వృథా చేసుకోవద్దని, ఒకరో, ఇద్దరో వస్తే సరిపోతుందన్నారు. ఏయే గ్రామాల్లో ఎటువంటి సమస్యలున్నాయో తనకు తెలుసునని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యా వ్యవస్థను సక్రమ మార్గంలో నడిపించేందుకు విద్యా కమిటీ లు కృషి చేయాలని, వారికి ఉపాధ్యాయులు సహకరించా లన్నారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన విద్యా కమిటీ చైర్మన్‌లను ఆయన అభినందించారు.