చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో స్టాఫ్ నర్సులుగా పనిచేసేందుకు ఎంపికైన 206 మందికి మంగళవారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఎంహెచ్వో ప్రభావతిదేవి తెలిపారు. ఉదయం 10 గంటలకు డీఎంహెచ్వో కార్యాలయంలో జరిగే కౌన్సెలింగ్కు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు. ఇతర వివరాలకు 9440290777, 93819050378లను సంప్రదించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.