పాఠశాల విద్యా వ్యవస్థలో సాంకేతిక, ఇతర కారణాలతో వాయిదాపడిన టీచర్ల పని సర్దుబాటు (వర్క్ అడ్జ్స్టమెంట్) ప్రక్రియ సోమవారం నుంచి మొదలు కానుంది. ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనల మేరకు ఉత్తర్వుల్లో స్వల్ప మార్పులు చేస్తూ ప్రక్రియను ఈనెల 14వ తేదీలోపు పూర్తి చేయనుంది. పీపుల్-టీచర్ రేషియో (పీటీఆర్)లో 2024 ఆగస్టు 7వ తేదీ కాకుండా ఆగస్టు 9వ తేదీ యూడైస్ ఆధారంగా ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, మున్సిపాలిటీ యాజమాన్యాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), పీడీ, పీఈటీ టీచర్ల వర్క్ అడ్జస్టెమెంట్ చేపట్టనున్నారు. హైస్కూల్ ప్లస్ పాఠశాలలకు ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చారు.