చిత్తూరు జేసీ పులి శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం రిలీవ్‌కానున్నారు. బుధవారం గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన స్థానంలో కొత్త జేసీగా ప్రభుత్వం నియమించలేదు. సోమవారం ఉదయం కలెక్టరేట్లో జరిగే ప్రజా ఫిర్యాదుల వేదికలో పాల్గొంటారు. మధ్యాహ్నం కలెక్టర్‌తో కలిసి ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణపై తహసీల్దార్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తారు.