రాష్ట్రంలో రద్దుచేసిన భవననిర్మాణరంగ కార్మిక సంక్షేమబోర్డును పునరుద్ధరించి, నిర్మాణరంగ కార్మికులను ఆదుకోవాలని ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, భవననిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి సలీంబాషా లు డిమాండ్ చేశారు. బి.కొత్తకోట పట్టణంలోని కార్యాలయంలో ఆదివారం జరిగిన తాపీ మేస్త్రీలు, కూలీల సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ 2006లో ప్రారంభమైన సంక్షేమబోర్డును 2019 తర్వాత గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. భవననిర్మాణాలకు ఇసుక ఉచి తంగా సరఫరా అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని కార్మికులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, రఘునాథ్, మురళి, రామాం జులు, రఫీ, సురేష్, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.