ఏపీ ప్రాజెక్టులకు తుంగభద్ర వర్రీ పట్టుకుంది. తుంగభద్ర ప్రాజెక్టు 19 వ గేట్ కొట్టుకు పోవడంతో అక్కడి నుంచి వరద నీరు కిందికి వస్తోంది. ప్రాజెక్టు ప్రస్తుతం నీటి నిల్వ 97 టీఎంసీలు కాగా.. 40 టీఎంసీలకు నీటి నిల్వలను తగ్గిస్తేనే ప్రాజెక్టు గేట్ పెట్టే అవకాశం ఉంది. ఈ వరద ప్రవాహం రేపు సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరే అవకాశం ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో ను అధికారులు పెంచుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 87 వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1 లక్ష 90 వేల క్యూసెక్కులుగా ఉంది. ఇప్పటికే నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నీటి ప్రవాహంతో నిండిపోయాయి. వరద ప్రవాహం శ్రీశైలంను తాకిన వెంటనే నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులో వరద నీటి విడుదలపై నిర్ణయానికి రావాలని అధికారులు నిర్ణయించడం జరిగింది.