ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. తమ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరుని వైసీపీ ఖరారు చేసింది. ఇక ఈ ఎన్నికల్లో పోటీకి కూటమి సిద్ధమైనప్పటికీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఇవాళ (సోమవారం) అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాగా కూటమి తరపున తెరపైకి బైరా దిలీప్ చక్రవర్తి పేరు వచ్చింది. మరోవైపు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నేడు అభ్యర్థి పేరును టీడీపీ అధిష్థానం ప్రకటించే సూచనలు ఉన్నాయి.