ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ వ్యవహారం వ్యక్తిగతమని, తామెక్కడా ఆయనను విమర్శించడం లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సోమవారం నాడు ఏపీ సచివాలయంలో మంత్రి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తమను ఇబ్బందులు పెట్టిన వైసీపీ ముఖ్య నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరించలేదని అన్నారు. వైసీపీ నేతలు తమపై బురదజల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో తమను దోషులుగా చూపించాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. విద్యుత్‌ను 24గంటల పాటు వినియోగదారులకు అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రైతులకు నాణ్యమైన కరెంట్‌ను అందిస్తామని స్పష్టం చేశారు. 6 నుంచి 7శాతం విద్యుత్ వాడకం పెరుగుతోందని వివరించారు. ఈ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. నూతన విద్యుత్ ప్లాంట్లు, సోలార్ విద్యుత్, రైతులకు కుసుమ్ యోజన పథకాన్ని ఏ విధంగా అందించాలన్న విషయంపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు.