ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 04:30 PM

విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి అత్యంత హేయమని, ప్రభుత్వ ప్రోద్భలంతోనే ఈ ఘటన జరిగిందని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ధ్వజమెత్తారు. అంబేడ్కర్‌ అంటే సీఎం చంద్రబాబుకు గౌరవం లేదని, అందుకే ఆయన ఇప్పటి వరకు విజయవాడలో ఆ స్మృతివనాన్ని సందర్శించలేదని గుర్తు చేశారు. విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి చేసిన దుండగులను తక్షణమే శిక్షించాలని డిమాండ్‌ చేసిన ఆయన, ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం దారుణమని అన్నారు. చివరకు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికే రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని, ఇది రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన లా అండ్‌ ఆర్డర్‌ను చూపుతోందని కైలే అనిల్‌కుమార్‌ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com