వైసీపీ ఐదేళ్ల పాలన అస్థవ్యస్తం, అవినీతిమయంగా సాగిందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. దుగ్గిరాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పేదలకు ఇళ్లు అంటూ పార్టీ రంగేసుకున్న వారికే ఇంటిస్థలం ఇచ్చారని, అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. కొన్నిచోట్ల నివాసానికి ఉపయోపడని, పనికిరాని లేఅవుట్లు వేసి ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ ఒత్తిళ్ళకు తలొగ్గి అధికారులు వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, అక్రమాలను వెలికితీసి, అవినీతిపరులు తిన్న మొత్తాన్ని కక్కిస్తామని ప్రభాకర్ స్పష్టం చేశారు. నాయకులు బొప్పన సుధాకర్, తాతా సత్యనారాయణ, మాగంటి నారాయణ ప్రసాద్, లావేటి శ్రీనివాసరావు, నంబూరి నాగరాజు పాల్గొన్నారు.