కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలెక్టరేట్ కార్యాలయం నందు సోమవారం జిల్లా కలెక్టర్ బాలాజీ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మీకోసం కార్యక్రమంలో 94 అర్జీలు వచ్చాయని వాటిని 48 గంటల్లో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.