తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి బేసిన్‌లో రాజమహేంద్రవరం, సంగం, పేరూరు, పోలవరం..ఇలా అన్నిచోట్లా నీటిలో పీహెచ్ పరిమితి దాటింది. నీరు నేరుగా తాగడానికి వీల్లేని పరిస్థితి ఉంది. జలచరాలు, మొక్కలు జీవించడానికి అనువుగా లేదు. కొలిఫాం బ్యాక్టీరియా అన్నిచోట్లా పరిమితికి మించి ఉంది. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కాలుష్య ప్రభావం మరింత అధికంగా ఉంది.