కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం కేంద్ర మత్స్యశాఖ అధికారుల బృందం పలు ప్రాంతాలను పరిశీలించారు. మత్స్య సంపదను పెంపొందించే విధంగా నూతన ఆధునికమైన పద్ధతులను ఉపయోగించుకుని తమ జీవనాధారాన్ని మత్స్యకారులు పెంచుకోవాలని తెలిపారు. మత్స్యకారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తీర ప్రాంతంలో దొరికే చేపల వివరాలు అడిగి తెలుసుకున్నారు.