కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామ సర్పంచ్ కవిత ఈ నెల 15న ఢిల్లీ ఎర్రకోటలో జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంపికయ్యారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని గోళ్ల పంచాయతీ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ కవితను గ్రామస్థులు, మండల పరిషత్, గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది సత్కరించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. దేశంలో శాంతియుతంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు.