గుంటూరులో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. మస్తానయ్య దర్గా ధర్తకర్త రావి రామ్మోహన్ రావు కొడుకు రావి మస్తాన్ సాయిని సెబ్ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయితో కలసి సుబానీ హోటల్ నిర్వాహకులు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఈ కేసులో సుభానీ హోటల్ యజమాని ఇద్దరు కొడుకులు నాగూర్ షరీఫ్ , ఖాజా మొయినుద్దీన్లు అరెస్టు అయ్యారు. మస్తాన్ సాయి, సుబానీ హోటల్ తనయులు గతంలో పలు కేసుల నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వరలక్ష్మి టిఫిన్స్ , పల్లెటూరి దోసే హోటల్స్ నిర్వాహకులతో కలసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మాజీ ఎమ్మెల్యే అన్న కొడుకు గత ఐదేళ్లుగా డ్రగ్స్ ముఠాకు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.