అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన నిందితుడిగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో కొందరు నిందితులు ఉన్నారు. 1. జోగి రాజీవ్, 2. జోగి సోదరుడు వెంకటేశ్వరరావు, 3. అడుసుమిల్లి మోహన రంగ దాసు, 4. వెంకట సీతామహాలక్ష్మీ, 5. సర్వేయర్ దేదీప్య 6. మండల సర్వేయర్ రమేశ్, 7. డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్, 8. విజయవాడ రూరల్ ఎమ్మార్వో జాహ్నవి, 9. విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులు ఈ జాబితాలో ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా మిగతా వారిని పోలీసులు త్వరలో విచారించే అవకాశం ఉంది.