ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద మళ్లీ నవ హారతులను ప్రారంభిస్తామని తెలిపారు. 2019కి ముందు వరకు నవహారతులు కొనసాగాయని వివరించారు. వేల సంఖ్యలో తరలి వచ్చిన భక్తుల కోసం ఆనాడు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక హారతులు నిలిపివేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో హారతుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పవిత్ర సంగమం ఘాట్‌ను మంగళవారం నాడు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, కొలుసు పార్థసారధి పరిశీలించారు.