భీమిలి సబ్ రిజిస్ట్రార్ వి.తులసీదాస్‌ను ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసింది. సరైన పత్రాలు లేని ఆస్తి రిజిస్ట్రేషన్‌కు 38 డాక్యుమెంట్లు రాగా వాటిని వెంటనే తిరస్కరించకుండా ఎక్కువ కాలం ఉంచుకున్నందుకు, దానిపై ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ స్థానంలో ఆడిట్ విభాగంలో పనిచేస్తున్న గోపీ అని అధికారిని తాత్కాలికంగా నియమించారు.