సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో కాన్పు అయిన ఆడ శిశువును సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయిన నేపథ్యంలో మంగళవారం ఆ చిన్నారిని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు 108 వాహనంలో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం క్షేమంగా ఉందని 108 ఈఎంటి హరిబాబు తెలియజేశారు.