కందుకూరు పట్టణంలో పటిష్టమైన శాంతిభద్రతలకు కృషి చేస్తానని సీఐ కె. వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పట్టణంలో గంజాయి రహిత వాతావరణాన్ని కల్పించడానికి కృషి చేస్తామన్నారు. పట్టణ శివారులలో మద్యం సేవించడం నేరమని, అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పట్నంలో ఏర్పాటు చేసి ఉన్న సీసీ కెమెరాలను పూర్తిస్థాయిలో మర మత్తులు చేయించడం జరుగుతుందని ఆయన వివరించారు.