చీరాలలో పోలీసు నిఘా వ్యవస్థ నిద్రాణ స్థితిలో ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందువల్లే నేరాలు పెరిగి పోతున్నాయనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఈపూరుపాలెం విద్యార్థి ఆరిఫ్ హత్య కేసులో అరెస్ట్ అయిన ముద్దాయిల్లో సందీప్, జిలాని, మహేంద్ర అనే వారిపై ఒక్కొక్కరి మీద 12 కేసులు, రౌడీషీట్లు ఉన్నట్లు సాక్షాత్తు ఏ. ఎస్. పి విఠలేశ్వరరావు మీడియాకు చెప్పారు. మరి అలాంటి వారిపై నిఘా పెట్టారా అంటే లేదనే బదులు వస్తోంది.