కేంద్ర ప్రభుత్వం, మైనింగ్ కంపెనీల నుంచి ఖనిజాలు కలిగిన భూములపై రాయల్టీకి సంబంధించిన పాత (ఏప్రిల్ 1, 2005 తర్వాతి) బకాయిలను వసూలు చేసుకోవడానికి సుప్రీంకోర్టు బుధవారం రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాలకు వచ్చే 12 ఏళ్లలో బకాయిలు చెల్లించవచ్చని కోర్టు పేర్కొంది. అయితే, ఈ బకాయిలపై ఎలాంటి జరిమానాలు విధించొద్దని రాష్ట్రాలను ఆదేశించింది.