విజయనగరం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ఆవరణలో ఈ నెల 8న అర్ధరాత్రి సమయంలో పెందుర్తికి చెందిన భార్యభర్తలపై దాడి చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు వన్‌టౌన్ సీఐ ఎస్ శ్రీనివాస్ తెలిపారు. పెందుర్తి వెళ్లేందుకు రైల్వే స్టేషన్లో దిగి, వేరే ట్రైన్ లేనందున రైల్వే స్టేషన్ బయటకు వచ్చి టీ తాగి, వేచి ఉన్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తిస్తూ, అడ్డువచ్చిన భర్తని దారుణంగా కొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై బాధి తులు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాడి కి పాల్పడిన కోరాడ దండు (ఆలియాస్ దండు రాజు), బొగ్గు సూరి(ఆలియాస్ సూర్య)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు. హత్యా యత్నానికి ఉపయోగించిన కర్రను, చాకును సీజ్ చేసినట్టు తెలిపారు.