విజయనగరం జిల్లా, గరివిడిలో ఫేకర్ పరిశ్రమ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డీఎఫ్ఎన్ కాలనీకి చెందిన కొండ్రు కరుణ(26) మృతి చెందాడు. మరో యువకుడు కింతాడ రేవంత్ పరిస్థితి విషమంగా ఉండ డంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం ఆసుపత్రికి త రలించారు. దీనికి సంబంధించి గరివిడి ఎస్ఐ దామోదర రావు, స్థానికులు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డీఎఫ్ఎన్ కాలనీకి చెందిన కరుణ గరివిడిలో సెల్పాయింట్ నడుపుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం మిత్రులైన రేవంత్, నూకరాజుతో కలిసి బైక్పై డీఎఫ్ ఎన్ కాలనీ నుంచి గరివిడి వస్తున్నాడు. ఈ క్రమంలో ఫేకర్ పరిశ్రమ వద్దకు వచ్చే సరికి గరివిడి నుంచి డీఎఫ్ఎన్ కాలనీ వైపు వెళ్తున్న లారీని ఎదురుగా ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కరుణ అక్కడికక్కడే మృతి చెందాడు. రేవంత్ తీవ్రంగా గాయపడగా, మరో యువకుడైన నాగరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతుడి తల్లితండ్రులు నాగేశ్వరరావు, అప్పాయమ్మ గ్రామంలో కూ లి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా కరుణ రెండో వాడు. కుమారుడి మృతితో తల్లితండ్రులు విలపిస్తున్నారు. దీంతో గ్రా మంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గరివిడి ఎస్ఐ దామోదరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.