గ్రామ పంచాయతీల్లోని చెత్త సంపద కేంద్రాలను అభివృద్ధి చేసి గ్రామాల్లో పారిశుధ్యం తొలగించే చర్యలు చేపట్టడంలో సర్పంచ్‌లు, కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. సీతానగరం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తడి, పొడి చెత్తలు తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రీన్ అంబా సిడర్ల గౌరవ వేతనాలు స్వచ్ఛభారత్ నుంచి నేరుగా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. పంచాయతీల అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుందన్నారు. గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు సర్పంచ్‌లు, కార్యదర్శులు భాగస్వామ్యంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఈశ్వరరావు, ఈవోపీఆర్‌డీ కేకే వర్మ, బలగ శ్రీరాములునాయుడు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.