అల్పపీడన ధ్రోణి ప్రభావ కారణంగా గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలోని 27 మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పుంగనూరులో 90.4, అత్యల్పంగా చిత్తూరులో 1.0 మిమీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో పుంగనూరులోని ఆర్టీసీ బస్టాండు వెనుక10 రోజులుగా ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ పరికరాలు నీట మునిగాయి. మహారాష్ట్రకు చెందిన సుమారు 30 కుటుంబాలు ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో వర్షంతో పనులు ఆగాయి. పనులు జరగకపోవడంతో ఆకలితో ఇబ్బందులు పడుతున్నట్లు వలస కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, మండలాలవారీగా పూతలపట్టులో 59.8, తవణంపల్లెలో 52.2, చౌడేపల్లెలో 38.6, కార్వేటినగరంలో 30.4, గంగాధరనెల్లూరులో 27.4, బంగారుపాళ్యంలో 26.0, పెనుమూరులో 25.0, గుడుపల్లెలో 24.4, శాంతిపురంలో 22.6, బైరెడ్డిపల్లెలో 22.2, రామకుప్పంలో 18.2, కుప్పంలో 18.0, పలమనేరులో 16.4, సోమలలో 14.6, ఐరాలలో 13.4, పులిచెర్లలో 13.0, గంగవరంలో 12.2, వి.కోటలో 12.0, చిత్తూరు రూరల్‌లో 11.4, పెద్దపంజాణిలో 6.4, గుడిపాలలో 4.8, రొంపిచెర్లలో 3.4, వెదురుకుప్పంలో 3.4, సదుంలో 3.2 మి.మీ చొప్పున వర్షం కురిసింది. ఆగస్టు నెల సగటు జిల్లా వర్షపాతం 122.1 మి.మీ. కాగా, మంగళవారం వరకు 112.6 మిమీ వర్షం కురిసింది.