టీబీ డ్యాం క్రస్ట్‌గేట్లను మార్చాలని సాంకేతిక నిపుణుడు కన్నయ్యనాయుడు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోకపోవడమే ఈ దుస్థితికి కారణం అని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. అయన మాట్లాడుతూ...తుంగభద్ర డ్యాం నిండుకుండలా ఉండటంతో రైతుల ఆశలు చిగురించాయి. ఈ దశలో క్రస్ట్‌గేట్ కొట్టుకుపోవడం బాధాకరం. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితి తలెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్య తలెత్తిన క్షణం నుంచి జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో చర్చిస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా నీటిని కాపాడుకునేందుకు ఉన్న మార్గాలన్నింటిని అన్వేషించాలని ఆదేశించారు. జూలైలోనే వర్షాలు వచ్చి జలాశయం నిండింది. ఇప్పుడు మళ్లీ వర్షాలు వస్తాయా రావా అన్నది తెలియడం లేదు. ఉన్న నీటిని సాధ్యమైనంత వరకు నిలుపకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అని తెలిపారు.