వీలైనంత త్వరగా తుంగభద్ర గేటును అమర్చి నీటి వృథాను అరికడతాం. వర్షాలు వచ్చి మళ్లీ జలాశయం నిండుతుంది. నేనే వచ్చి వాయనం సమర్పిస్తాను అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. అయన మాట్లాడుతూ...19వ గేటు ఎక్కువ కాలం మన్నిక వచ్చింది. 1954 నుంచి కాలువలకు నీరు వదిలారు. సుమారు 70 సంవత్సరాల పాటు క్రస్ట్‌గేట్లు మన్నిక వచ్చాయి. కన్నయ్య నాయుడు సూచనలతో స్టాప్‌లాగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆగస్టు 17 తరువాత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రైతులు అధైర్యపడాల్సిన అవసరంలేదు అని భరోసా కల్పించారు.