ప్రత్యామ్నాయ పంటల విత్తనాలకు 80 శాతం సబ్సిడీ ఖరారైంది. వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వేరుశనగ, కంది తదితర పంటలు ఆశించిన స్థాయిలో సాగు కాలేదు. ప్రధాన పంటల సాగుకు అదును దాటిపోయింది. దీంతో అనంతపురం జిల్లాకు 27,907 క్వింటాళ్ల ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు కేటాయించారు. ఇందులో ఉలవలు 21,791 క్వింటాళ్లు, పెసలు 1,501, అలసంద 3,253, జొన్న 973, కొర్ర 369, మినుమిలు 20 క్వింటాళ్లు ఉన్నాయి. వీటి ధరలను ఖరారు చేయలేదు. కేవలం 80 శాతం సబ్సిడీని వర్తింపజేయాలని నిర్ణయించారు. త్వరలోనే ధరలు, పంపిణీ తేదీ ఖరారు చేస్తారని అధికారులు తెలిపారు.