సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో మ ంగళవారం ఉదయం ఓ వ్యక్తి తన భార్యను దారుణం గా హత్యచేశాడు. స్థానికుల వివరాల ప్రకారం.. దేవీపట్నం మండలం దండంగి గ్రామానికి చెందిన చాట్ల జాను, అంగులూరుకు చెందిన దివ్య భారతి(30) భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో ప్రభుత్వం లోతట్టు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించడంతో జాను కుటుంబం పురుషోత్తపట్నం వచ్చి ఓ కాలనీలో జీవనం సాగిస్తున్నారు. భారతి అందంగా ఉండడంతో మొదటి నుంచి జాను అనుమానం కలిగి ఉన్నాడు. ఈ క్రమంలో ఆమెను ఇబ్బందులకు గురిచేస్తుండడంతో గతంలో ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొంతకాలం కోర్టులో నడిచింది. తరువాత పెద్దల మధ్య సర్దుబాటు చేసుకున్నారు. అయినప్పటికీ అనుమానం పోలేదు. భారతి తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా సేవలు చేసేందుకు వెళతానని భర్తను కోరగా అం దుకు ఒప్పుకోలేదు. అయినా తల్లిపై మమకారంతో ఆసుపత్రికి వెళ్లింది. దీంతో మళ్లీ ఇద్దరి మధ్య తగవు జరగడంతో విసిగిపోయిన భారతి తన భర్తతో జీవితం ఇలానే ఉంటుందని ఇక కాపురం చేయలేనని విడాకులకు ప్రయత్నాలు చేపట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన జాను మంగళవారం ఉదయం తొర్రిగడ్డ పాత పంపింగ్ స్కీమ్ వద్ద బహిర్భూమికి వెళ్లిన భార్యపై పోటకత్తితో వెనుక నుంచి తల, మెడపై నిర్ధాక్షిణ్యంగా నరికి చంపాడు.ఈ ఘటనపై మృతురాలి తండ్రి సరిపల్లి చిట్టియ్య ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్టు ఏఎస్‌ఐ సమర్పణరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.