అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అగ్రిగోల్డ్ భూములను ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చర్యలు చేపట్టామని చెప్పారు. జోగి రమేష్ కుమారుడు జోగి రాజు, బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు రికార్డులు, సర్వే నెంబర్ కూడా మార్చేశారని ఎమ్మెల్యే వివరించారు. జోగి రమేష్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.