విద్యుత్‌బిల్లుల చెల్లింపుల కోసం ఫోన్‌పే, గూగుల్ పే వం టి డిజిటల్ చెల్లింపులకు వినియోగదా రులను ప్రోత్సహించిన విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ఆ చెల్లింపులు నిలిపివేయటంతో ఊహించని షాక్ తగిలింది. నెల రోజుల వ్యత్యాసంలోనే బిల్లుల చెల్లింపులు భారీగా తగ్గిపోవటంతో ఆ శాఖ అధికారులను ఖంగు తినిపిం చింది. దాంతో తిరిగా ఉన్నతాధికారులు ఫోన్ పే చెల్లింపులు తిరిగి పునరుద్ధరించినట్లు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు విద్యుత్‌పంపిణీ సంస్థ ఏపీసీపీడీసీఎల్ యాప్, వెబ్‌సైట్‌తో పాటు ఫోన్ పేతో కూడా ఇకపై చెల్లింపులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. సాధారణంగా విద్యుత్‌రెవెన్యూ కార్యాలయాలకు వచ్చి క్యూలలో వేచి ఉండటం వంటి వ్యయప్రయాసలు లేకుండా ప్రత్యామ్నాయ చెల్లింపులకు వినియోగదారులను ప్రోత్సహించారు. ఆన్‌లైన్ చెల్లింపులతో పాటు స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరిగాక ఫోన్‌ల నుంచే బిల్లుల చెల్లింపు జరుపుకునేలా ఫోన్ పే, గూగుల్ పేలను ప్రోత్సహిస్తూ వినియోగదారులకు అవగాహన కూడా కల్పించారు. తద్వారా బిల్లుల చెల్లింపు ఎంతో సులభతరంగా మా రింది. విద్యుత్‌శాఖకు కూడా సకాలంలో బిల్లుల బకాయిలు ఖజా నాకు వచ్చి చేరాయి. కొన్ని సాంకేతిక కారణాలతో గత నెలాఖరున ఫోన్‌పే, గూగుల్‌పే చెల్లింపులు చెల్లవని ప్రకటించారు. దాంతో వినియోగదారుల్లో తీవ్ర గందరగోళం వ్యక్తమైంది. ఇప్పటి వరకు ఫోన్ పే, గూగుల్ పేల సాయంతో విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అలవాటుపడిన వినియోగదారులు ఏపీసీపీడీసీఎల్ యాప్, వెబ్ సైట్ ద్వారా చెల్లింపులు తెలియక విద్యుత్ రెవెన్యూ కార్యాలయా లకు పెద్దఎత్తున చేరుకున్నారు. దాంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు, చెల్లింపు కేంద్రాల వద్ద చాంతాడంత క్యూ కనిపించింది. నల్లచెరువు ఈఆర్‌వో కార్యాలయం ఎదుట రెండు కౌంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ వినియోగదారుల రద్దీ తగ్గని పరిస్థితి నెలకొన్నది. అయితే ఫోన్‌పే, గూగుల్ పే చెల్లింపుల నిలిపివేత సాంకేతిక కారణాలతోనే జరిగిందని ఇందులో ఎవరి ప్రమేయం లేదని చెబుతున్నారు.