తుంగభద్ర జలాశయానికి స్టాప్‌లాగ్ ఏర్పాటు చేయాలని గతంలో చాలా ప్రయత్నాలు చేశాం అని కన్నయ్య నాయుడు అన్నారు. అయన మాట్లాడుతూ...రాతితో డ్యాంను నిర్మించడంతో సాధ్యం కాలేదు. ఒక్కరాయి కదిలినా పూర్తిగా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే స్టాప్‌లాగ్‌ల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం. తుంగభద్రలో ఈ సమస్య తొలిసారిగా ఎదురైంది. చైనల మార్పుతో పాటు రోప్‌ల మరమ్మతులు చేయాలని సీడబ్ల్యుసీకి ప్రతిపాదించాం. మా సూచన ప్రకారం గేట్లకు పూర్తిస్థాయి మరమ్మతులు చేస్తే 30 సంవత్సరాల పాటు ఇలాంటి ఇబ్బందులు ఎదురు కావు అని అన్నారు.