జాతీయ జెండా ఎగరవేసే వేళ ఫ్లాగ్ కోడ్ 2002 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. జాతీయ జెండాలో కాషాయ వర్ణం పైకి వచ్చేలా చూడాలి. జెండాను పై నుంచి కిందికి వేలాడదీయకూడదు. పతాకానికి సమానంగా గానీ, ఎత్తులో గానీ ఏ ఇతర జెండా ఎగురకూడదు. జెండాపై ఏదైనా రాయడం, జెండా నుంచి ఏదైనా తొలగించడం చట్ట విరుద్ధం. పోల్ కు చిట్ట చివరనే ఎగురవేయాలి, సగం కిందకు దించి ఎగురవేయకూడదు. దెబ్బతిన్న, చెదిరిన జెండాను ప్రదర్శించకూడదు.