ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్ గా తీర్చిదిద్దాల్సి ఉందని, ఆ దిశగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ విభాగాలపై బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు గారు సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్, సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఏపీ ఫైబర్ నెట్ ఎండి దినేశ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.