రాష్ట్రంలో వెయిటింగ్లో ఉన్న IPSలకు మెమో జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు IPSలు కుట్ర చేసినట్లు నిఘా విభాగం గుర్తించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దీంతో DGP కార్యాలయం అప్రమత్తమై వెయిటింగ్లో ఉన్న 16 మంది IPSలకు మెమోలు జారీ చేసింది.