ఐరోపా ఖండానికి శీతాకాలంలో రష్యా నుంచి గ్యాస్ సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించే నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్ ధ్వంసం వెనుక ఉక్రెయిన్వాసి హస్తం ఉన్నట్లు జర్మనీ ప్రకటించింది. సదరు నిందితుడిని వొలొద్మిర్ జీగా పేర్కొంది. అతడి పేరిట అంతర్జాతీయ అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. అనుమానితుడు పోలాండ్‌లో ఉన్నట్లు భావిస్తుండటంతో ఆ దేశానికి కూడా సదరు వారెంట్ కాపీని పంపింది.