ఏపీలో అన్నా క్యాంటిన్లు పున:ప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో కలిసి కృష్ణా జిల్లా గుడివాడలోని మున్సిపల్ పార్క్ సమీపంలో క్యాంటిన్ ప్రారంభించారు. అనంతరం వారిద్దరూ ప్రజలకు భోజనాలు వడ్డించారు. తొలి విడతలో రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 99 క్యాంటిన్లు మొదలుకానున్నాయి. కేవలం రూ. 5కే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందించనున్నారు.