• గత నవంబరులో ఎస్ఐపీబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మెగా ప్రాజెక్టులకు రాయితీలు ప్రకటిస్తూ జారీ అయిన ఉత్తర్వులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
• కేపీఆర్ ఇండస్ట్రీస్‌కి చెందిన 243.13 ఎకరాల భూమిని గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు బదలాయిస్తూ కేబినెట్ నిర్ణయించింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొంతమూరు గ్రామంలోని, బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఉన్న ఈ స్థలంలో 2700 కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు దశల్లో కాస్టిక్ సోడా ప్లాంట్ ను నెలకొల్పనున్నారు. దీనివల్ల 1300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
• కాకినాడ ఎస్‌ఈజడ్‌లో క్రూడ్, కెమికల్ మ్యానుఫ్యాక్ఛరింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు హల్ధియా పెట్రో కెమికల్ లిమిటెడ్ కంపెనీకి ప్రత్యేక రాయితీల ప్యాకేజీ ఇవ్వడానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహాకాల బోర్డు (ఎస్ఐపీబీ)లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి జనవరి 3 న ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే హల్దియా పెట్రో కెమికల్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వీటిని అంగీకరిస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
కియా ఒప్పందానికి ఆమోదముద్ర :
• కియా మోటార్స్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 15న చేసుకున్న ఒప్పందంపై కూడా మంత్రి వర్గం ఆమోదం వేసింది. అనంతపురం జిల్లా గూడుపల్లి, యర్రమంచి గ్రామాల పరిధిలో ప్రాథమికంగా సంవత్సరానికి 3 లక్షల కార్లను ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం కుదరింది.
‘కియా’ క్రియారూపంలో తెచ్చిన పరిశ్రమల శాఖకు ముఖ్యమంత్రి ప్రశంసలు :
• కియా మోటార్స్ తొలికారు విడుదలపై మంత్రిమండలిలో చర్చ. ఇదొక చారిత్రాత్మక అంశం. పరిశ్రమల శాఖకు ముఖ్యమంత్రి అభినందనలు. ఈ అభినందనలను మంత్రిమండలిలో రికార్డ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించిన ముఖ్యమంత్రి. సాల్మన్ రాజు బృందానికి అభినందనలు. ‘కియా’ తమ ద్వారానే వచ్చిందన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను ఎద్దేవా చేసిన సీఎం.
• గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వోక్స్‌వ్యాగన్‌ను రాష్ట్రానికి దూరం చేశారని, జర్మనీలో అధికారులను జైలుపాలు చేశారని, ఇక్కడేమో బొత్సకు ప్రమోషన్ ఇచ్చారని విమర్శించిన ముఖ్యమంత్రి. అశోక్ లేలాండ్, ఇసుజు, హీరో మోటాకార్ప్, అపోలో టైర్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ను ఆటోమొబైల్ హబ్‌గా రూపొందిస్తున్నాం.
SC, ST పారిశ్రామికవేత్తలకు చేయూత :
• ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్ధికంగా చేయూత. NSCFDC& NSTDFC సౌజన్యంతో స్టేట్ ఛానెలైజింగ్ ఏజెన్సీ (SCA)ల ఏర్పాటు.
• రూ.50 కోట్ల ప్రభుత్వ గ్యారంటీ (ఇందులో రూ.25.కోట్లకు NSCFDC, మరో రూ.25 కోట్లకు NSTDFC గ్యారంటీ). రెండు శాతం గ్యారెంటీ కమిషన్ చెల్లిస్తూ ఈ సంస్థల సహకారంతో ఎస్టీ, ఎస్సీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రుణాలు పొందేందుకు వీలుకల్పించే విధాన నిర్ణయం. మంత్రిమండలి ఆమోదం.
చక్కెర కర్మాగారాలకు చేయూత :
• అవసరమైన సహకార చక్కెర కర్మాగారాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా షరతులు లేని డీఫాల్ట్ గ్యారంటీ పథకం కింద 7.85% వడ్డీరేటుతో NCDC నుంచి రూ.200 కోట్ల రుణం. మంత్రిమండలి ఆమోదం.