కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌కు చెందిన ఏఎస్ వత్సల అనే మహిళ సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయారు. నకిలీ పెట్టుబడి పథకంలో పెట్టుబడులు పెట్టి ఏకంగా రూ.2.01 కోట్లు పోగొట్టుకున్నారు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు ఉంటాయని సైబర్ నేరగాళ్లు నమ్మబలకడంతో జూన్ నుంచి ఆగస్టు వరకు నకిలీ ట్రేడింగ్ ఖాతాల్లో డబ్బును బదిలీ చేసింది. చివరికి మోసాన్ని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.