ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఒలింపిక్ పతక విజేతలతో కలిసి కూర్చున్నారు. అయితే ఆయన కుర్చీపై విమర్శలు వచ్చాయి. దీనిపై కేంద్రం స్పందించింది. ఒలింపిక్ పతక విజేతలకు ముందు వరుసలో సీట్లు కేటాయించడంతో కాంగ్రెస్ ఎంపీలకు వెనక వరుసలో సీట్లు కేటాయించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.