ఏపీ సీఎం చంద్రబాబుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మద్దతుతోనే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ నిలబడిందన్నారు. అలాంటప్పుడు కేంద్రాన్ని రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో నిలదీయాల్సింది పోయి వేడుకుంటున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు పోరాడుతుంటే.. ప్యాకేజీల కోసం దొంగలు ఫైట్ చేస్తున్నారని మండిపడ్డారు.