ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘దీపం’ పథకాన్ని కేంద్రంలోని ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో అనుసంధానం చేయనున్నారు. దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన వారికి ఉజ్వల యోజన ప్రయోజనాలను పొందేలా చర్యలు చేపట్టనున్నారు. రూ.300 వరకు సబ్సిడీని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సూచించింది. ఈ ప్రతిపాదన ఆమోదించబడితే వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గుతుంది.