అమెరికాలో కాలిఫోర్నియా బీచ్ లో ప్రమాదవశాత్తు నీటమునిగి ఏపీకి చెందిన సాఫ్ట్వేర్ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామానికి చెందిన బుచ్చిబాబు(40) శనివారం సాయంత్రం ఫ్యామిలీతో కలిస బీచ్‌కు వెళ్లారు.బీచ్‌లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. కుమారుడి మరణం వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. బుచ్చిబాబు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.