అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ రక్షా బంధన్. తమ సోదరులు జీవితాంతం తమకు రక్షగా ఉండాలని ఈ రోజున వారి చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. మరి మారుతున్న కాలానికి అనుగుణంగా ‘రక్షగా నిలవడం’ అనే పదానికి విస్తృతి పెరిగిందనే చెప్పాలి. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు, ఉద్యోగ భద్రతపై అనుమానాలు నెలకొన్న ఈ తరుణంలో కేవలం భౌతిక రక్షణే కాకుండా ఆర్థికంగానూ వారికి భరోసానివ్వాలి. అదే అక్కాచెల్లెళ్లకిచ్చే నిజమైన బహుమతి.